కోడి గుణాలు - bruyat

ఒకసారి దక్షిణమధ్య క్షేత్ర ( కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ) ప్రచారకులైన శ్రీ యాదవరావు జోషీ గారు ఆంధ్రప్రాంత పర్యటనలో ప్రచారకుల బైఠక్ లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కోడి గుణాల గురించి వివరించారు. అందరికన్నా ముందు నిద్రలేస్తుంది, అందరినీ నిద్రలేపుతుంది, తనవారికోసం ఎంత బలవంతమైన శత్రువుతోనైనా పోరాటానికి సిద్ధమవుతుంది, అందరితో కలివిడిగా ఉంటుంది అని కోడి గుణాల గురించి వివరించి, చివరలో ఇలాంటి కోడిని చూస్తే మీకేమనిపిస్తుంది అనడిగారు. వెంటనే శ్రీ పి. వేణుగోపాలరెడ్డి గారు లేచి ఇన్ని గుణాలున్న కోడిని కోసి, వండి, తిని ఆ గుణాలను పొందాలనిపిస్తుంది అన్నారు. 
   
    మీకూ అలాగే అనిపిస్తుందిగదూ !

Post a Comment

0 Comments