63, మైనారిటీ ఫోబియా: ఇంగ్లీషు భాష మైనారిటీలైన ఆంగ్లో - ఇండియన్ల భాషఅయినందున దానికి రాజ్యాంగంలో స్థానం కల్పించాలని ఫ్రాంక్ ఆంధోనీ అంటుంటారు. ఆంధోనీగారు జాతీయుడిగా భావించుకుంటున్నట్లయితే మైనారిటీలు, మెజారిటీలు అనే భావజాలాన్ని విడనాడాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ ద్వంద్వనీతికి ఒక పరిమిత ప్రయోజనమేవుంది. మొత్తం జాతీయ జీవితాన్నే పట్టిపీడించేలా దీనిని విస్తరించలేము. అలాచేస్తే మన వర్గీకరణ ప్రాతిపదికను మార్చుకుపోతున్న కొద్దీ ఎన్నో రకాల మైనారిటీలు వుంటారు. ఫలితంగా ప్రతిఒక్కరూ ఏదో ఒక మైనారిటీ వర్గానికి చెందుతారు. మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు, రాజకీయమైనారిటీలు, జాతిపరమైన (racial) మైనారిటీలు, వృత్తిపరమైన మైనారిటీలు వగైరా మైనారిటీలు వస్తారు.
0 Comments