ధ్వజస్థంభం
క్రింది చిత్రంలోని ధ్వజ స్థంభం చిత్రం కథేమిటో తెలుసుకోవాలని ఉందా ! ?
ఈ నెల 5,6,7 తేదీలలో గుజరాత్ లోని కఛ్ లో ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ సమావేశాలలో పెట్టబడిన ధ్వజస్థంభమిది.
1947 దేశవిభజన సందర్భంలో కరాచి లో స్వయంసేవక్ అయిన శ్రీ నారాయణగిరి హరిగిరి గోస్వామి , తాము ప్రాణాలతో భారత్ కు చేరుకుంటానన్నది గ్యారెంటీ కాకపోయినస ,తమ ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేసి వచ్చినా, ఈ 40 - 50 కిలోల తూకమున్న ధ్వజస్థంభాన్ని , ధ్వజాన్ని మాత్రం తీసుకుని వచ్చారు. అంతేకాదు కఛ్ లోని మాండవి లో మొదటి సంఘశాఖను ప్రారంభించారు.
ఇది ఒక స్వయంసేవక్ సమర్పణ భావానికి ఉదాహరణ. ఈ రకంగా వేలాది సమర్పిత సామాన్య స్వయంసేవకులే సంఘానికి వెన్నెముక. అందుకే సంఘం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
సంఘ మొలక నేడు వటవృక్షమవడమేగాక కల్పవృక్షమూ అయింది.
0 Comments