స్వర్ణమయ బుద్దుడు

ఒక బౌద్ధారామంలో చాలా పెద్దదైన బుద్ధుని మట్టి విగ్రహం ఉండేది. ఆరామం మీదుగా రహదారి నిర్మిస్తున్నందున ఆ విగ్రహాన్ని మరోచోటికి మార్చాల్సి వచ్చింది. విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో పెద్ద వర్షం వచ్చింది. బౌద్ధభిక్షువులు విగ్రహం మీద ఒక గుడారం కప్పారు. అర్ధరాత్రి బౌద్ధ భిక్షువుల పెద్ద లోపలికి వెళ్ళి టార్చి వేసి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మట్టి విగ్రహం నుండి స్వర్ణకాంతి కన్పించింది. దగ్గరకెళ్ళి విగ్రహాన్ని ముట్డుకున్నాడు. దాంతో ఆ ముట్డుకున్న చోట మట్టి రాలి, అక్కడా స్వర్ణకాంతి. మొత్తం మట్టి తొలగించగా అతనికి యావత్తు విగ్రహం బంగారంతో చేసిందని అర్థమైంది. 
  ఈ స్వర్ణ బుద్ధుడు నేటికీ థాయ్ లాండ్ లో ఉన్నాడు. పాశ్చాత్యులు థాయ్ లాండ్ మీద దాడి చేసినపుడు ఆ విగ్రహాన్ని మట్టితో కప్పి పెట్టారు. రహదారి నిర్మాణంకారణంగా ఆ స్వర్ణ మూర్తి బయటపడ్డాడు. 

ఈ సంఘటన ఒక యౌగిక దృక్పథాన్ని చూపుతుంది. బాహ్యరూపంలో మనమంతా మట్టిబొమ్మలం. అంతర్లీనంగా మన అందరిలో ఒక స్వర్ణమయ బుద్ధుడు ఉన్నాడు.

    (ఈ రోజు తెలంగాణ విశ్వహిందూపరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి గారు షేర్ చేసిన ఫోటో )

Post a Comment

0 Comments