మాతృభాష - bruyat

కాటుకను కళ్ళకు పెట్టుకుంటె అందం, కాదని ఒంటికంతా పూసుకుంటే ! ?

       ఒక విధంగా భాష, బ్రతుకు వేర్వేరు కాదు. ఒక ప్రదేశంలో జీవించేవారి జీవన ప్రతిబింబమే , వారి భాష. ముఖం వేరు, ప్రతిబింబం వేరే కావడం సాధ్యం కాదు. ప్రతిబింబాన్ని మార్చాలనుకుంటే, మూల వస్తువునే మార్చాల్సిఉంటుంది. నేడు మన మాతృభాషకు బదులు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనుకునేవారు కోరుకుంటున్నది అదే. మన ప్రాచీన జీవన నిష్ఠ ,  ఆదర్శాలను చూస్తే నొసలు చిట్లించేవారు వీరు.  రాజకీయ స్వార్థం కోసం ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే అలాంటివారి వ్యతిరేకతను దేశజీవన ప్రవాహం కాలక్రమంలో  కొట్టుకుపోయేలా చేస్తుంది. వేలాది సంవత్సరాల జీవన ప్రవాహాన్ని అడ్డుకుని , వ్యతిరేక దిశలో దానిని ప్రవహింపజేసే పిచ్చి సాహసం అది. భూగర్భంలో తన వేర్లను జొప్పించిన చెట్టులో , మరొక రకమైన పూలు, పండ్లు కాసేలా చేసే హాస్యాస్పద ప్రయత్నమది ! 

                                               - హొ.వె. శేషాద్రి జీ

Post a Comment

1 Comments

  1. When you finish exploring the reviews on the location, have the ability to|you possibly can} proceed to third-party evaluate sites, guidance of} associates, learn boards, examine social media, and confirm that your decide is wise. Furthermore, learn the phrases and situations fastidiously and perceive what agreements the casino operates beneath. It’s important to grasp something that 카지노사이트 might concern and impact you and your cash. The Loyalty program consists of ranges, ten particularly, and the higher the extent, the bigger the bonus.

    ReplyDelete