నీ మార్గమేకద హిందు జనతా సంఘటనకాధారము
మౌనివై నీ యోగ బలమును సంఘ సేవలొ ధారవోసి
జ్ఞానివై విజ్ఞాన దీపపు కాంతులను దశ దిశలు చూపి
శక్తివై నవయువత మదిలో దేశ భక్తిని వెలికితీసి
యుక్తిగా మన సంఘ రథమును విజయపథమున నడిపినట్టి ||మాధవా ||
నీ మాటలే మంత్రాలుగా నీ చూపులే వేదాలుగా
హిందు జాతిని ఒకటి చేయగ ఏకతా యజ్ఞమ్ముచేసి
సంఘశాఖను కల్పతరువు అఖండభారతమంతవేసి
పూజ్య కేశవునాశయాలకు రూపమై మా ముందు నిలిచిన ||మాధవా||
0 Comments