అందుకొనుము శ్రధ్ధాంజలి మేరు ధీర గురూజీ
అఖండ భరత ధాత్రి కొరకు అహరహము తపించినావు
రాష్ట్ర పురుష సేవలోన ప్రాణములర్పించినావు
ఒక మారా? ఒక ఏడా? పావన భారత ధాత్రిని
ధూమ శకటమే గృహముగ నీమముతో తిరిగినావు || ఆ సేతు ||
మానవులను శ్రేష్ఠులుగా మలచిన మహనీయ శిల్పి
కేశవుడే గురుతించిన ఆశాకిరణము నీవె
కర్మ వీరవ్రతము నీది ధర్మ దీక్ష తపము నీది
ధ్యేయ మార్గమై నిలచిన మాయా మానుష రూపా || ఆ సేతు ||
నీ నడిచిన మార్గములో జనతను నడిపించినావు
సంఘశక్తి నీ జాతికి వరముగ చూపించినావు
నీవు పలుకు ప్రతి మాటలొ నిండియుండు నీ తపస్సు
నీ జీవితమొక యజ్ఞము నీ చూపే ఒక లోకము || ఆ సేతు ||
0 Comments