మందిర నిర్మణముకైన్ మరో అడుగు వేద్దాము - bruyat

మందిర నిర్మాణముకై- మరో అడుగు వేద్దాము
జాగరణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేద్దాము
గడప గడప చేరి మనం ప్రతి గుండెని కదిలిద్దాం
రామ కార్య సాధనకై తనుమనధన మర్పిద్దాం

ధర్మరూపు దాల్చినట్టి మహిన మానవోత్తముడు
యుగపురుషుడు శ్రీ రాముడు తరతరాలకాదర్శం
రాముని వలె జీవించే తరం మళ్ళి రావాలి
రాముని వలె పాలించే రాజ్యమిపుడు కావాలి "మందిర"

విదేశీయ బానిసత్వ కళంకమును తుడిచేసి
కరసేవతో హిందుశక్తి సాధించిన విజయము
గత వైభవ సంస్కృతిని అయోధ్యలో నిలబెడుదాం
విశ్వగురువు పీఠం పై జాతిని అధిరోహిద్దాం "మందిర"

విశ్వ శాంతికాధారం విలువల హిందుత్వమే
హిందుత్వం ప్రతిరూపం శ్రీరాముని జీవితమే
శ్రీరాముని తత్వాన్ని జాతికిపుడు తెలుపుదాం
ప్రతి హిందువు సోదరుడని ప్రతి మదిలో నిలుపుదాం "మందిర"

Post a Comment

0 Comments