అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఉండే విషయం లో డాక్టర్ జీ ఎలా ఉండేవారు - bruyatఅనవసరమైన విషయాల జోలికి పోకుండా ఉండే విషయం లో డాక్టర్ జీ ఎలా ఉండేవారు...

1932 సం||లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులెవ్వరూ సంఘ కార్యకలాపాల్లో పాల్గొనరాదనే ఉత్తరువులను జారీచేసింది. ఆ విధంగా ఉత్తర్వులు జారీచేయుటకు గల కారణమేమని కౌన్సిలు సభ్యులు ప్రశ్నిస్తే అప్పటి మంత్రి ఈ రాఘవేంద్ర రావు గారు డాక్టర్ జీ ఉపన్యాసాలు చూస్తే హిట్లర్, ముసోలినీలను సమర్దిస్తున్నట్లు కనుపిస్తుంది. కాబట్టి సంఘాన్ని నిషేధించుట అవసరమన్నారు. తానెన్నడూ ఆ విధంగా చెప్పటం అసంభవమని డాక్టర్ జీ కి పూర్తినమ్మకం. మళ్ళీ వారు ఆ సభ్యుల ద్వారానే 'డాక్టర్ హెడ్గేవార్ ఉపన్యాసాల సంపుటిని ముందుంచమన్న' ప్రశ్నను అడిగించారు. అపుడు సి. ఐ. డి. శాఖ రహస్య రిపోర్టులన్నీ శోధించబడ్డాయి. వాటిలో ఎక్కడా హిట్లర్ - ముసోలినీల పేర్లన్నా ఉదహరించినట్లు కూడా లేదు డాక్టర్ జీ తమ ఉపన్యాసాల్లో అనవసర విషయాలేవీ రాకుండా చాలా మెలకువతో వ్యవహరించేవారు. --శ్రీ యాదవరావ్ జోషీ.

Post a Comment

0 Comments