డాక్టర్ జీ దృష్టిలో ఎవరు రాష్ట్రీయులు - bruyat



పందొమ్మిది వందల యిరవై సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్న రోజులు వార్ధా జిల్లాలో 'ఖరాంగణా' గ్రామంలో జరుగనున్న సమావేశానికి కేశవరావు, ఒక ముస్లిం నాయకుడు, మరికొందరి మిత్రులతో నాగపూర్ నుండి వార్ధాకు కారులో వెళ్తున్నారు. ఆ ముస్లిం నాయకునికి టర్కీ టోపీ వుంది. దానిని చూచి కేశవరావు నవ్వుతూ “ఏమండీ తమరు సహాయనిరాకరణోద్యమ నాయకులైయుండి గాంధీటోపీ వాడక యీ టోపీ వాడుతున్నారే "మని అడిగారు "కేశవరావ్ యిది మా రాష్ట్రీయ చిహ్నం. దీనిని మేము ఎలా విడువగలం" అని వారు జవాబిచ్చారు. ఈ ఘట్టం కేశవరావ్ మనస్సును కలత పెట్టింది.

ఎవరు భారత రాష్ట్రీయతను తమ రాష్ట్రీయతకు భిన్నంగా వుందని భావిస్తారో అటువంటి వారివల్ల భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రయోజనం అంతగా వుండదు అనే విశ్వాసం కేశవరావుకు కలిగింది..... అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు‌. ---కీ. శే. శ్రీ డాక్టర్ మొహరీర్.

Post a Comment

0 Comments