డాక్టర్జీ కీ ఏదైనా విషయం పై ఇబ్బంది ఉంటే ఎలా స్పందించేవారు... -bruyat

 


డాక్టర్జీ కీ ఏదైనా విషయం పై ఇబ్బంది ఉంటే ఎలా స్పందించేవారు...

ఒక సారి డాక్టర్ జీ ఇంటి పొరుగున ఉన్న ఒక పెద్ద మనిషి సంఘం మీద నేరాన్ని మోపుతూ ఒక ఉత్తరాన్ని వార్తా పత్రికల్లో ప్రకటించి సంఘ అధికారులను దానికి తగు సమాధానం ఇవ్వ వలసిందిగా కోరారు. డాక్టర్ జీ ఆ వార్త చదివిన తర్వాత దానికి జవాబు వార్తా పత్రికల ద్వారా సమాదానం ఇవ్వటానికి బదులుగా స్వయంగా వారింటికి వెళ్ళారు. పాపమాయన వార్త చదివిన తర్వాత కోపం వచ్చి పోట్లాడడానికి వచ్చాడు అనునుకున్నారు. కాని డాక్టర్ జీ చాలా శాంతంగా ఆ వార్తలో ఆయన వ్రాసిన విషయాలకు తగు జవాబిచ్చారు. ఆ పెద్దమనిషి చాలా తృప్తి చెందారు. అక్కడనుండి వెళ్ళడానికి లేచేటప్పుడు డాక్టర్ జీ ఆయనతో - "తమకు అనుమానాలుంటే ప్రక్కనే ఉంటున్నాను కాబట్టి తప్పక నన్ను అడగండి. మనం ప్రత్యక్షంగా ఒకరి నొకరు కలుసుకొని అర్ధం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం. ఒకరి కొకరం దగ్గరకువద్దాం" అన్నారు. --శ్రీ నానాసాహబ్ భాగవత్.

Post a Comment

0 Comments