డాక్టర్జీ జమా ఖర్చులు లెక్కల విషయంలో ఎలా ఉండేవారు... - bruyat

 


డాక్టర్జీ జమా ఖర్చులు లెక్కల విషయంలో ఎలా ఉండేవారు...

సంఘం ప్రారంభించబడిన దినాల్లో స్వయం సేవకుల వివాహాది శుభకార్యాలు జరిగే సమయాన వారి తల్లిదండ్రుల నుండి సంఘానికగు వ్యయానికై ధనాన్ని సేకరించేవారు. ఆ రోజుల్లో 'గురుదక్షిణ' వుత్సవం జరుగుతుండేదికాదు. ఒకనాడొక స్వయం సేవకుని ఉపనయన సందర్భంలో అతని తండ్రిగారి వద్దకు డాక్టర్ జీ నిధి సేకరణ నిమిత్తం వెళ్ళారు. "మీది రిజిష్టరు సంస్తేనా ? " అని వారు డాక్టర్ జీని అడగ్గా - "కాదండి" అని సమాధానం యిచ్చారు. అప్పుడాయన 'రిజిష్టరుకాని సంస్థలలో డబ్బు దుర్వినియోగం అవుతుంది" అని అన్నారు. అది వినగానే డాక్టర్ జీ తన ప్రక్కన వున్న రఘు నాథరావును ఇంటికి వెళ్ళి జమా ఖర్చుల పుస్తకం తీసుకురమ్మన్నారు రఘునాధరావు ఆ పుస్తకాన్ని తెచ్చి వారెదుటనుంచాడు. ఆ పుస్తకంలో అంతకు ముందు రోజువరకూ జరిగిన జమా ఖర్చులు వివరంగా వ్రాయబడి వుండటం వారు గమనించి చాలా సంతోషించారు. ఇక ముందు కూడా మీకు సహాయం చేస్తుంటాను అని అంటూ పది రూపాయలు తీసియిచ్చారు. ఈ విధంగా డాక్టర్ జీ దమ్మిడీలతో సహా వివరంగా జమాఖర్చులు వ్రాస్తూండేవారు. --శ్రీ అణ్ణాజీ వైద్య.

Post a Comment

0 Comments