సమయపాలన - bruyat


సమయపాలన
ఒకసారి డాక్టర్జీ నలుగురు స్వయం సేవకులతో కలసి ఆడేగావ్ అనే గ్రామానికి వెళ్ళారు. ఆ ఊళ్ళో డాక్టర్జీ స్నేహితులొకరు ఉంటున్నారు. ఆయన కుమారునికి ఉపనయనం చేస్తున్నారు. అది ఆఖరు రోజు, భోజనాలు అయ్యేటప్పటికి ఆలస్యమైంది. నాగపూర్ వెళ్ళే ఆఖరి బస్సు వెళ్ళిపోయింది.
ప్రతి ఆదివారం సంఘ స్వయంసేవకుల ఏకత్రీకరణ, సమత నాగపూర్ లో జరుగుతుంది. దానికి ప్రతివారు తప్పక హాజరు కావాలి. డాక్టర్జీ పొరుగూరులోనే సాయంత్రందాకా ఉండిపోయారు. నాగపూర్ చేరేందుకు వేరే సాధనమేదీ లేదు. అందుకని డాక్టర్జీ నాగపూరు
కాలినడకన బయలుదేరారు. వెంట స్వయం సేవకులు నలుగురూ ఉన్నారు.
ఎవరో అన్నారు : 'నాగపూర్ ఇక్కడికి దగ్గరేమీ కాదు. 32 మైళ్ళ దూరం ఉంది.'
డాక్టర్ హెడ్డెవార్ 'మనం రాత్రి అంతా నడిచామంటే తెల్లవారేసరికి సంఘస్థాన్ సమయానికి చేరి తీరుతాము' అన్నారు.
స్నేహితులు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించారు. కాని డాక్టర్జీ ఎవరి మాటా వినలేదు. ఆయన నడక ప్రారంభించారు. కృతనిశ్చయంతో పనిచేసేవారికి భగవంతుడు తప్పక తోడ్పడతాడు. వారు సుమారుగా పదిమైళ్ళు నడిచి ఉంటారు. నాగపూర్ వెళుతున్న బస్సు ఒకటి వారి దగ్గరకు వచ్చి ఆగింది. దాని డ్రైవర్ డాక్టర్జీని గుర్తించి బస్సు ఆపాడు. 'డాక్టర్జీ, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళుతున్నారు?” నవ్వుతూ డాక్టర్జీ 'నాగపూర్ తప్పక వెళ్ళవలసి ఉంది. మరొకదారి లేదు. ఏమి చేయాలి?” అన్నారు. అందరినీ బస్సులో కూర్చోబెట్టుకొని నాగపూర్
తీసుకొని వెళ్ళాడు. రాత్రి 2 గంటలకు నాగపూర్ చేరారు. ఉదయం సరిగా సమయానికి సంఘస్థాన్‌కు వెళ్ళారు.

Post a Comment

0 Comments