సర్ సంఘచాలక్ నుండి మోటర్ చాలక్ వరకు ఒకే పంక్తి. bruyat

సర్ సంఘచాలక్ నుండి మోటర్ చాలక్ వరకు ఒకే పంక్తి.

1979-80సంవత్సరాలలో జనతాపార్టీ అంతర్గత రాజకీయాలలో భాగంగా కొందరు సోషలిస్టు మిత్రులు జనసంఘీయులను, వారితోపాటుగా ఆర్.ఎస్. ఎస్. వారినీ కలిపి విమర్శించుతూ ఉండటం నిత్య కృత్యంగా ఉండేది. 
        
        ఒకరోజున  హాపూర్- గాజియాబాద్ నుండి లోకసభకు ఎన్నికైన కుంవర్ మహమ్మదాలీ ఖాన్ (అనంతర కాలంలో 1990-93లో ఆయన మధ్యప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు) కల్పించుకొని "మీ రెవరైనా, వారి కార్యాలయానికి గాని, శిబిరాలకుగాని పోయి, వారి వ్యవహారశైలి చూశారా?" అని అడిగాడట. 

"లేదు, వారిదగ్గరకు మే మెందుకు పోతాం?"అంటూ ఆక్కడివారందరూ ఈసడింపుగా జవాబిచ్చారట.

అప్పుడు ఆయన -"నేను వెళ్లాను, నేను చూశాను. సర్ సంఘచాలక్ నుండి మోటర్ చాలక్ వరకు అందరూ ఒకేవరుసలో కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇది ఆర్.ఎస్.ఎస్. లోనే సాధ్యం. మీలో ఎందరు ఇలా మీ మోటర్ చాలక్ ను ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేస్తున్నారో చెప్పండి" అంటూ నిలదీశాడట. వారందరూ నిరుత్తరు లైనారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుగదా!

 సంఘానికి నాల్గవ సర్ సంఘచాలక్ గా ఉండిన ప్రొ౹౹ రాజేంద్రసింహ చెప్పిన విషయమిది.

( ' సమరసత నినాదంకాదు,నిబద్ధత ' గ్రంథంనుండి.)

Post a Comment

0 Comments