మాతృభాష గొప్పతనం గురించి - Bruyat

మాతృభాష గొప్పతనం గురించి:
మొదటి సంవత్సరం వరకూ నాకు ఆంగ్లం రాదు . కానీ , ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నా నేతృత్వంలో పనిచేస్తున్నారు . 

ప్రతి మనిషికీ అతని అమ్మభాషలోనే విజ్ఞానశాస్త్ర బోధన జరగాలి . ఆంగ్లేయులు తప్ప మిగిలిన అంతర్జాతీయ శాస్త్రవేత్త లందరూ .. జపనీయులు , ఫ్రెంచివారు , జర్మన్లు , రష్యన్లు , బల్గేరియన్లు ... వీళ్లందరూ విజ్ఞానశాస్త్రం గురించి వారి భాషలోనే మాట్లాడతారు . రాస్తారు . అధ్యయనాలు కొనసాగిస్తారు . 

నేనూ నా అమ్మభాష తమిళంలోనే చదువుకున్నా మా అనుభవం చెప్పే మాట ఒక్కటే ... మాతృభాషలో విద్యాభ్యాసం వైజ్ఞానికరంగంలో ముఖ్యమైన స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తుంది . శక్తిని పెంచుతుంది . సహజ మేధస్సుకు వన్నెలద్దుతుంది . విజ్ఞానశాస్త్రం మీద , సాంకేతిక విషయాలకు సంబంధించిన మౌలికాంశాల మీద లోతైన అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది .

 విజ్ఞానశాస్త్రం , సాంకేతిక చదువులకు ఆంగ్లమే శరణ్యమన్న అభిప్రాయాన్ని చెరిపేసుకోవాలి . 

- పద్మశ్రీ మేల్ స్వామి అన్నాదురై , ఇస్రో ' చంద్రయాన్- 1 ప్రాజెక్టు డైరెక్టర్

Post a Comment

0 Comments