విద్యార్థులు రెండు రకాలు - Bruyat

వి.వి.జాన్ అని జోధపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉండేవారు. ఆయన చెప్పేవారు - విద్యార్థులు  రెండు రకాలు.

1) చెడ్డవిద్యార్థులు   వీరు చదవరు, పరీక్షలు   సరిగా వ్రాయక   తప్పుతారు. 

  2) మంచి విద్యార్థులు. రోజూ కళాశాలకు వస్తారు, పాఠాలు వింటారు, ఇంటిదగ్గర చదువుతారు , పరీక్షలు బాగా వ్రాస్తారు. కాబట్టి ఉత్తీర్ణులవుతారు. ఐతే పరీక్షలుకాగానే మరిచిపోతారు. వాటితో ఇంకేమి అవసరముందని.

దేశానికి ప్రమాదం ఎవరినుండి? చెడ్డ విద్యార్థులు ఉద్యోగాలలోకి రారు. మంచివిద్యార్థులు ఉద్యోగాలలోకి వస్తారు. కాని విషయాలు గుర్తుండక గుత్తేదారుల మాటలకు తల లూపుతారు. ఇటువంటి మంచివిద్యార్థులనుండి దేశాన్ని రక్షించుకోవాలి.

Post a Comment

0 Comments