ద్రావిడ ప్రాణాయామం - 2
పాత మధ్యప్రదేశ్ గృహశాఖ మంత్రి శ్రీ ద్వారకా ప్రసాద్ మిశ్రా కు శ్రీ దత్తోపంత్ జీ సంఘ ప్రచారక్ అనే విషయం తెలుసు. అందుకే ఆయన ఠేంగ్డేజీ తో నిస్సంకోచంగా మాట్లాడేవారు. ఆయన ఒకసారి శ్రీ దత్తోపంత్ జీ తో ఇలా చెప్పారు:
" మీ సంఘం మీద గాంధీజీ హత్య తర్వాత నిషేధం విధించారు. ఆ నిషేధపు అవధి ఒక సంవత్సరం. ఆ తర్వాత నిషేధం దానంతట అది తొలగిపోతుంది. మీరేమో మళ్ళీ సంఘశాఖలు ప్రారంభిస్తారు. దాంతో జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్ర గృహశాఖల మంత్రులందరితో , సంఘం మీద నిషేధం తొలగినా ఫర్వాలేదా లేక మళ్ళీ నిషేధం విధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేద్దామంటారా అని సలహా తీసుకోవాలనుకున్నారు. నన్ను కూడా పిలిపించారు. ఈసారి ఎలాగైనా నెహ్రూను tease చేయాల్సిందే అని వెళ్ళాను. నెహ్రూ అదే విషయం ఎత్తగా నేను, మీరు మా అభిప్రాయం తీసుకోవాలని ఎందుకనుకుంటున్నారు ? మీ మనసులో ఆరెస్సెస్ కు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నారుగా అన్నాను. నెహ్రూ కు కోపమొచ్చింది. " నేను ఆరెస్సెస్ కు ప్రోత్సాహం ఇస్తున్నానా ? నేను దాన్ని అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నాను " అన్నాడు. అపుడు నేను చూడండి! మీరు వేలాదిమందిని జైళ్ళలో వేయించారు. వేలాది కుటుంబాలు కకావికలయ్యాయి. వాళ్ళంతా ప్రారంభం నుండి సంఘాన్ని సమర్థించేవారు కాదు. ప్రత్యక్షంగా సంఘ వ్యక్తుల సంఖ్య ఇంత లేదు. మీవల్ల ఇంతమందిని జైళ్ళలో వేసిన కారణంగా ,వాళ్ళంతా సంఘానికి దగ్గరయ్యారు. అ విధంగా మీరు సంఘానికి ప్రోత్సాహం అందించారు అన్నాను.అంతలో గదిలోకి ఎవరో రావడంతో మా సంభాషణ ఆగిపోయింది.
అయిదారు రోజుల తర్వాత అవకాశం చూసుకుని నేను ,ఆ రోజు మన సంభాషణ అర్ధాంతరంగా ముగిసింది. నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది.' ఏ సంస్థనైనా నాశనం చేయాలనుకుంటే నెహ్రూ ఎంచుకున్న దారి కాకుండా మరొకటి ఉంటుందా ? అది విన్న నెహ్రూ నవ్వుతూ ,ఆ దారి ద్రావిడ ప్రాణాయామం తో సమానం అన్నాడు.
శ్రీ ద్వారకా ప్రసాద్ మిశ్రా నోటి వెంట ద్రావిడ ప్రాణాయామం అనే పదం శ్రీ ఠేంగ్డే జీ వినడం ఇది రెండవసారి. ఆయన వెంటనే ద్రావిడ ప్రాణాయామం కంటే సులభమైన ప్రాణాయామం ఇంకేమైనా ఉందా ? అనడిగారు.
అందుకు శ్రీ మిశ్రా ,ఒక సంస్థను ఇలా అణిచివేయాలని ప్రయత్నిస్తే దాని కార్యకర్తల్లో మరింత పట్టుదల పెరగడమేకాక ,ఇతరులు కూడా దానిని సమర్థిస్తారు.మనం ఎంచుకునే మార్గం మనస్తత్వశాస్త్రం చెప్పేలాగా ఉండాలి. సంస్థను అణగదొక్కే ప్రయత్నం చేయడంకన్నా ఆ సంస్థలో comfort- loving cadres మరియు status conscious leaders తయారయ్యే వ్యవస్థను చేయాలి. ఇది సులభంగా జరుగుతుంది.ఆ సంస్థలోని కార్యకర్తలకు ఎక్కువ సదుపాయాలు కలిగించండి.మెల్లమెల్లగా వాళ్ళు అ సదుపాయాలకు బానిసలైపోతారు.అలాగే నాయకులను status conscious చేయడంకూడా సులభమే.సంస్థలో మీ ముద్ర కనబడటం లేదని చెప్పండి. వాస్తవంగా మీ యోగ్యతకు ఆ సంస్థ అధ్యక్ష లేదా ప్రధాన కార్యదర్శిని చేయాల్సింది.సంస్థలో అందరికన్నా క్రియాశీలక వ్యక్తి మీరే అని చెప్పండి. ఈ మాటలు అతడిలో నాటుకుపోతాయి.అంతే, మీరింకేం చేయాల్సిన అవసరం ఉండదు. సంస్థ రోజురోజుకూ దిగజారి పోతుంది" అన్నారు.
ఈ దృష్టికోణం కూడా శ్రీ దత్తోపంత్ జీ కి సరి కొత్తది.

0 Comments