రష్యా పర్యటన
1968 లో భారత పార్లమెంట్ ప్రతినిధుల బృందం సోవియట్ రష్యా వెళ్ళింది. అందులో శ్రీ దత్తోపంత్ జీ కూడా ఉన్నారు. శ్రీ సంజీవరెడ్డి ఆ బృందానికి నాయకుడు. ఆ పర్యటనలో లెనిన్ గ్రాడ్ నుండి పెట్రోగ్రాడ్ కు మా బృందాన్ని స్టీమర్ లో తీసుకెళ్ళారు.పెట్రోగ్రాడ్ తరతరాలుగా జార్ చక్రవర్తుల రాజధానిగా ఉండేది. అక్కడ జార్ కు సంబంధించిన పెద్ద ప్యాలెస్ ఉంది.అక్కడున్న ఒక తోటలో గ్రీకు దేవతల తల మాత్రమే ఉన్న విగ్రహాలు ఉన్నాయి.ఇవి ఎవరి విగ్రహాలు అనడగ్గా జూపిటర్, వీనస్ మొదలగు గ్రీకు దేవతలవి అని చెప్పారు.కమ్యూనిస్టులు దేవతలమీద విశ్వాసం చూపరు అయినా ఈ విగ్రహాలు ఎందుకు తయారుచేయించి పెట్టారు? అనడిగాము.అపుడు సోవియట్ అధికారులు , మేము పూర్తిగా నాస్తికులం.అయితే హిట్లర్ సైన్యం ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ,కావాలనే మమ్మల్ని అవమానించడం కోసం ఇక్కడున్న ప్రాచీన దేవతల విగ్రహాలను ధ్వంసం చేయించాడు.మా మనసుల్లో ఆత్మవిస్మృతి ఏర్పడడానికి హిట్లర్ అలా చేశాడన్నమాట. ఆ సమయంలోనే జాతీయ గౌరవాన్ని తిరిగి పొందాలంటే మళ్ళీ ఆ విగ్రహాలను పునర్నిర్మాణం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాము. ఈ పునరుద్ధరణకు జాతీయ గౌరవంతో సంబంధం ఉంది.మా ఆస్తికత్వం లేదా నాస్తికత్వం అనే వాటితో దీనికి సంబంధమే లేదు అన్నారు.
0 Comments