వ్యక్తులతో సంబంధాలు తెంచుకోకండి
1993 లో పుణె సమీపంలోని చించ్వాడలో సమరసతా మంచ్ సమవేశం జరిగింది. అందులో ఒక విషయంపై మాట్లాడడానికి శ్రీ టెక్సాస్ గైక్వాడ్ ను ఆహ్వానించడం జరిగింది. ఆయన దళితులకు సంబంధించిన పనిచేసే కార్యకర్త. ఆయన సమావేశానికి వచ్చి , హిందుత్వం, హిందూ ధర్మం, శ్రీరాముడి గురించి తీవ్రమైన భాషతో మాట్లాడాడు. ఆయనకు ఇవ్వబడిన అంశాన్ని వదలిపెట్టి ,ఇతర విషయాలు చాలా మాట్లాడాడు. వేదికమీద శ్రీ ఠేంగ్డేజీ ,వేదికకు ముందు వరుసలో శ్రీ మోరోపంత్ పింగలె జీ ఉన్నారు. శ్రీ టెక్సాస్ గైక్వాడ్ ను ఉపన్యాసానికి పిలవడం పెద్దతప్పు అని కార్యకర్తలకు అనిపించింది. అయితే,వక్త ఎదుట లేచి నినాదాలు చేయడం, అల్లరి చేయడం మన పద్ధతి కానందున మౌనంగా ఉపన్యాసం వినాల్సివచ్చింది. ముగింపు కార్యక్రమంలో శ్రీ ఠేంగ్డేజీ వక్త. సమరసతా మంచ్ కు చెందిన ఆ సభలో ఆయన మొదటిసారిగా ' ప్రపంచ యవనికపై హిందూరాష్ట్ర ఆలోచన యొక్క పాత్ర ' గురించి మాట్లాడారు. శ్రీ టెక్సాస్ గైక్వాడ్ విరజిమ్మిన నిప్పుల్లాంటి మాటలపై నీళ్ళు చల్లినట్లయింది. సమావేశం పూర్తయ్యాక కూడా శ్రీ టెక్సాస్ గైక్వాడ్ ను సమావేశానికి ఎందుకు పిలిచారని శ్రీ ఠేంగ్డేజీ ఎవ్వరినీ అడగలేదు. పైగా , ఒక్కొక్కసారి మనిషి మానసిక సంతులనం తప్పుతుంటాడు, స్వార్థం పైకి ఎగజిమ్ముతూ వస్తుంది. మనం దాన్ని చూసిచూడనట్లు ఉండిపోవాలి. శ్రీ టెక్సాస్ గైక్వాడ్ తో సంబంధాన్ని వదులుకోరాదు అని శ్రీ దత్తోపంత్ జీ సలహా ఇచ్చారు.
0 Comments