సంఘ గటనాయక్ - dattopant thengadi stories in telugu - bruyat

సంఘ గటనాయక్
స్వదేశీ జాగరణ మంచ్ ను ఏర్పాటు చేయడానికి ముందు నాగపూర్ లో ఒక బైఠక్ జరిగింది.దానికి వివిధక్షేత్రాల కార్యకర్తలను పిలవడం జరిగింది.ఆ సమావేశం ముగిశాక శ్రీ దత్తోపంత్ జీ అహల్యా మందిర్ ( రాష్ట్రసేవికాసమితి ప్రధాన కార్యాలయం ) కు వెళ్ళారు. అయితే పై సమావేశానికి రాష్ట్రసేవికాసమితి నుండి ఎవరినీ పిలవలేదన్న బాధ,కోపం సేవికలకు ఉండింది.ఠేంగ్డేజీ సమావేశం గురించి, చర్చించిన విషయాల గురించి అక్కడి సేవికలకు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రసేవికాసమితి కి అప్పటి వందనీయ ప్రముఖ సంచాలిక అయిన ప్రమీలా తాయీ మేఢె అయనతో ,మీ ప్రణాళికలన్నింటి విజయమూ మహిళలపై ఆధారపడి ఉంది. ఆ ప్రణాళికలను వాళ్ళు అచరణలోకి తెస్తేనే అది సాధ్యమవుతుంది. ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులను కొనేది వాళ్ళే. వారి సహకారం లేనిదే ఈ విషయం విజయవంతం అవడం కష్టం.
అలాగే సేవికాసమితిలో ఉగాది మరియు విజయదశమి ఉత్సవాల కొరకు బౌద్ధిక్ విషయం కేంద్రం నుండే ఇవ్వడం జరుగుతుంది. దేశమంతటికీ ఒకే విషయం అందాలనే ఉద్దేశ్యంతో అలా చేస్తాము. ఈ సంవత్సరం మా బౌద్ధిక్ విషయం ' ఆర్థిక బానిసత్వం - రాజకీయ బానిసత్వానికి తొలి అడుగు'. చిత్రాతాయీ అనే సేవిక ఎంతో కష్టపడి రకరకాల వార్తాపత్రికలనుండి వ్యాసాలు, ఇంటర్వ్యూలు కత్తిరించి పెట్టారు అని ఆ సంగ్రహాన్ని అయన ముందుంచారు. వాటన్నింటినీ ఏదీ వదలకుండా శ్రీ ఠేంగ్డేజీ చూసేటప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. అహల్యామందిర్ నుండి సంఘకార్యాలయానికి బయల్దేరారు. అయితే నేరుగా అక్కడికి కాకుండా ఒక సంఘ జ్యేష్ఠ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆయనను నిద్ర లేపి , మనవల్ల ఒక తప్పిదం జరిగింది. సేవికాసమితి కార్యకర్తల ద్వారా ఈ విషయంలో చాలా అధ్యయనం, ఆలోచన జరిగింది‌ అంటూ బౌద్ధిక్ అంశం గురించి కూడా వివరించడం జరిగింది. అహల్యామందిర్ కు రేపు ఉదయమే త్వరగా వెళ్ళి , వారు సేకరించిపెట్టిన వార్తాపత్రికల కత్తిరింపులను చూడమని సూచన ఇచ్చారు.

Post a Comment

0 Comments