స్లీపర్ క్లాస్ యాత్రీకుడు
శ్రీ దత్తోపంత్ జీ ఒకసారి నాగపూర్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి రైల్వేస్టేషన్ లో ఉండగా ఒక పరిచిత వ్యక్తి కలిశాడు. ఆయన రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు శ్రీ ఠేంగ్డేజీతో , మీరు ఏ బోగీలో ఉన్నారని అడగ్గా S -1లేదా S- 2 అనో చెప్పారు. అది విన్న ఆ రాజకీయ నాయకుడు, ఆశ్చర్యకరంగా అరే! మీరింకా స్లీపర్ క్లాస్ లో ప్రయాణాలు చేస్తున్నారా ? ఇంత జనసమ్మర్ధంలో రకరకాల మనుషులు ఎదురుపడతారు. కనీసం ప్రయాణమైనా విశ్రాంతిదాయకంగా ,ప్రశాంతంగా చేయాలి. నేనైతే ఫస్ట్ ఎ/సి కి తక్కువ కాకుండా ప్రయాణిస్తాను .ఎందుకంటే ఇంతమంది కలిస్తే కూర్చోవడం కూడా కష్టమైపోతుంది అన్నాడు. శ్రీ ఠెంగ్డేజీ ఏమీ మాట్లాడకుండా, చిరునవ్వు నవ్వారు. ఆ నాయకుడు నమస్కారం పెట్టి తన బోగీ వైపు వెళ్ళిపోయాడు. ఈ విషయం చెబుతూ శ్రీ ఠేంగ్డేజీ , రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారు. వాళ్ళకు కేవలం ఓట్లు మాత్రమే కావాలి,ప్రజలు అక్కరలేదు. ఆ తర్వాత వాళ్ళు ప్రజలమధ్య కూర్చోవడాన్ని కూడా అసహ్యించుకుంటారు అన్నారు.
0 Comments