ఉదాసీనత వల్ల సంస్థ పెరుగుతుంది
హిందూ ధర్మంలోనుండి బౌద్ధంలోకి మారడానికి ఒక రోజు ముందు విదర్భ ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్యకర్తలతో నాగపూర్ లో కలసి కూర్చున్నారు శ్రీ బాబాసాహెబ్ అంబేడ్కర్. మాటల మధ్యలో ఒక కార్యకర్త సంస్థలు కొంతకాలం పాటు పెరుగుతాయి, కొంతకాలానికి కనుమరుగైపోతాయి.ఇలాఎందుకు? అనడగ్గా అంబేడ్కర్ ,నీ ప్రశ్నకు నేనేం జవాబివ్వాలి? 2400 ఏళ్ళ క్రితమే బుద్ధభగవానుడే స్వయంగా దీనికి జవాబిచ్చాడు. ' ఉదాసీనత ' ఉన్నట్లైతే పని పెరుగుతుంది, ' ఉదాసీనత ' లేనిచోట పని కనుమరుగైపోతుంది అని ఆయన పేర్కొన్నాడు అన్నారు.ఇది విన్న శ్రోతలకు బహుశా బాబాసాహెబ్ Slip of tongue అయ్యారు అనిపించింది. అంబేడ్కర్ దాన్ని గమనించి, నవ్వుతూ , నేనేమీ Slip of tongue అవలేదు. ఇక్కడ బుద్ధుడు ' ఉదాసీనత ' అనే పదప్రయోగాన్ని సాంకేతికార్థంలో వాడాడు. ఏదైనా పని లేదా సంస్థ కొత్తగా ప్రారంభమైనపుడు , దానిపట్ల ఎవరూ దృష్టి పెట్టరు. ప్రజలు దానిపట్ల ఉదాసీనంగా ఉంటారు. అయినా కొందరు ఆ పనిని చేస్తూ ఉంటారు. దాంతో ఆ పని లేదా సంస్థ కొంచం పెరుగుతుంది. దానివల్ల బయటినుండి వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అ వ్యతిరేకత ఉన్నా పని చేస్తూనే ఉంటారు. దీని కారణంగా వ్యతిరేకులమీద విజయం పొందుతారు, కీర్తి లభిస్తుంది. ఈ సమయంలోనే కార్యకర్తలలో మానసిక పరివర్తన వచ్చేస్తుంది.కష్టాలు పడుతూ నిరంతరం పనిచేశామనే భావన కలిగి, పని పెరగడంలో నా పాత్ర ఎంతుంది అనిపిస్తుంది.దీనినే Crisis of credit sharing అంటారు.అలా ప్రతివారూ తమతమ credit ఎంత, తమకెంత గౌరవం లభించాలని భావిస్తారు. ప్రాథమిక దశలోని కార్యకర్తలు credit sharing పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే పని పెరుగుతుంది. అలాకాక అదే కార్యకర్తలు credit sharing వెనుక పోటీపడితే పని కనుమరుగవుతుంది.అలా సాంకేతికార్థంలో బుద్ధుడు ఉదాసీనత అనే పదాన్ని ఉపయోగించాడు అన్నారు.

0 Comments