కిటికీ మీద రాయి విసురు - Dattopant Thengadi in Telugu

కిటికీ మీద రాయి విసురు..
ప్రస్తుతం ఆరెస్సెస్ కు ప.పూ.సర్ సంఘచాలక్ గా ఉన్న శ్రీ మోహన్ జీ భాగవత్ నాగపూర్ ప్రాంతప్రచారక్ ( ఆ రోజుల్లో నాగపూర్ నగరం ఒక ప్రాంతంగా ఉండేది ) గా ఉన్నప్పటి అనుభవం :
ఒకసారి సంఘ శిక్షావర్గకు సంబంధించి జరిగే బైఠక్ లో పాల్గొనడానికి శ్రీ దత్తోపంత్ జీ ఠేంగ్డే వచ్చారు. రేపటి కార్యక్రమానికి సంబంధించి అన్ని వ్యవస్థలూ పూర్తయ్యాయా అని నన్ను అడిగారు.అప్పటికి సమయం రాత్రి పదిన్నర దాటింది. పూర్తయ్యాయని చెప్పగానే , ఇక పనేమీ లేదు కాబట్టి అలా కొన్ని ఇళ్ళకు వెళ్ళొద్దాం పద! అంటూ బయల్దేరదీశారు. నా స్కూటర్ పై కూర్చుని ఒక ఇంటికి వెళ్ళడం ,ఆ ఇంట్లోవాళ్ళతో మాట్లాడటం, ఛాయ్ తాగడం, మరో ఇంటికి వెళ్ళడం ఇలా సాగింది. అలా ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి ఒంటిగంట అయింది.‌ ఆ ఇంట్లో వాళ్ళు గాఢనిద్రలో ఉన్నారు. గట్టిగా పిలిచినా ఎవరూ నిద్రలేవలేదు. అపుడు కిటికీ మీద ఒక రాయి విసురు అన్నారు శ్రీ దత్తోపంత్ జీ. నేను అదే చేశాను. దాంతో ఇంట్లోవారు లేచారు. తలుపు తీయగానే దత్తోపంత్ జీ కనపడ్డంతో వారి ఆనందానికి అవధులు లేవు. కాసేపు మాట్లాడాక, అంత రాత్రివేళ కూడా ఛాయ్ త్రాగిన తర్వాతే మేమిరువురం కార్యాలయం చేరుకోవడం జరిగింది.

Post a Comment

0 Comments