పరిచయాల వల్ల లాభం - dattopant thengadi in telugu - bruyat

పరిచయాల వల్ల లాభం
1968 లో మాస్కోకు వెళ్ళిన భారత ప్రతినిధుల బృందం అక్కడ దిగగానే స్థానిక అధికారులు, మీలో మిస్టర్ ఠేంగ్డే ఎవరు? అనడగడం ప్రారంభించారు. శ్రీ దత్తోపంత్ జీ తమను తాము పరిచయం చేసుకున్నారు. అపుడు ఆ అధికారులు నిన్నటినుండి ఒక భారతీయ విద్యార్థి మీ గురించి అడుగుతున్నాడని చెప్పారు. అది విని ప్రతినిధుల బృందానికంతా ఆశ్చర్యం. హోటల్ లో ఆ భారతీయ విద్యార్థితో పరిచయం అయింది. అతడి పేరు అఖిలేశ్ అగర్వాల్. అందరితోనూ అతడు పరిచయం చేసుకున్నాడు. నేను మాస్కో వస్తున్నట్లుగా ఢిల్లీలోని శ్రీ చమన్ లాల్ ( సంఘ విశ్వవిభాగ్ ప్రచారక్ ) తనకు సమాచారం ఇచ్చారని ఆ విద్యార్థి చెప్పాడు. ఆ తర్వాత అతడు ప్రతిరోజూ వచ్చి మాట్లాడి, ఏమైనా కావాలా అనే వివరాలు అడిగేవాడు.ఇదంతా చూసిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి అయిన శ్రీ హిరేన్ ముఖర్జీ , నాకు రష్యా పితృభూమి లాంటిది. అయినా నా వ్యక్తిగత అవసరాల గురించి అడగడానికి నావద్దకు ఎవరూ రాలేదు. మీవద్దకు రావడానికి, మీ వ్యక్తిగత అవసరాలను కనుక్కునేందుకు ఇక్కడ మీకొక వ్యక్తి ఉన్నాడు. ఇది నాకెంతో ఆశ్చర్యకరంగా ఉంది అన్నారు.
సంఘంలో సంపర్కానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

Post a Comment

0 Comments