జాతీయ కార్మిక దినం - dattopant motivational stories in telugu - bruyat

జాతీయ కార్మిక దినం
భారతీయ మజ్దూర్ సంఘ్, జాతీయ కార్మిక దినంగా మన పరంపరకు అనుగుణంగా విశ్వకర్మ జయంతిని జరుపుకోవాలని నిర్ణయం చేసింది. ఢిల్లీలో 1967 లో ఎన్.డి.ఎమ్.సి.లో ఈ ఉత్సవం జరుపబడింది. ప్రముఖ అతిథిగా శ్రీ హనుమంతయ్య వచ్చారు.అప్పటికి అయన కేంద్రమంత్రిగా ఉండేవారు.వక్తగా శ్రీ ఠేంగ్డేజీ, విశ్వకర్మ జయంతే అసలైన జాతీయ కార్మిక దినం.కాబట్టి మే 1 న కార్మిక ఉత్సవం చేయకుండా మేము విశ్వకర్మ జయంతిని జరుపుతాము. అందువల్ల విశ్వకర్మ జయంతి ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.
ఆ తర్వాత శ్రీ హనుమంతయ్య మాట్లాడుతూ, విశ్వకర్మ జయంతిని జాతీయ దినంగా జరపాలనడం నాకు అంగీకారయోగ్యమే. అయితే శ్రీ ఠేంగ్డే జీ ఉపన్యాసం విని చాలా ఆశ్చర్యం కలుగుతోంది. శ్రీ ఠేంగ్డేజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ అని తెలపడం జరిగింది. కాబట్టి ఆయన ఆలోచన కూడా హిందూ సంస్కృతికి అనుకూలంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను.
ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని జాతీయ దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించడమేగాక ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ మాటలు మన పరంపరకు అనుకూలంగా ఉన్నాయా ? అని నేను ఆయనను అడగదలచుకున్నాను. ఏ ఉత్సవపు ప్రాధాన్యత అయినా ప్రభుత్వ గుర్తింపు మీదే ఆధారపడి ఉంటుందని మనం భావిస్తామా ? మనం తరతరాలుగా విజయదశమి, హోళి జరుపుతూ వస్తున్నాము. అలా జరపడానికి ఏదైనా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడమే కారణమా ? కుంభమేళాకు లక్షలాది మంది వస్తారు. వాళ్ళంతా ప్రభుత్వ నోటిఫికేషన్ కారణంగా వస్తున్నారా ? ప్రభుత్వం జనవరి 26, ఆగష్ట్ 15 , అక్టోబర్ 2 కు అధికారికంగా ప్రాధాన్యతనిచ్చింది. జాతీయ సెలవుదినాలుగా ప్రకటించింది. మరి ఈ మూడు రోజులలో ప్రజలు ఉత్సాహపూరితంగా ఉత్సవం చేస్తున్నారా ? అందువల్ల ప్రభుత్వ గౌరవం , గుర్తింపు కావాలని కోరుకోవడం మన సంస్కృతికి అనుకూలంకాదు. గౌరవం పరంపరకు, ప్రజలకు లభించాలి అన్నారు. ఈ మాటలు విన్నాక ఆ డిమాండ్ ను వినిపించడం ఆపేసింది భారతీయ మజ్దూర్ సంఘ్.

Post a Comment

0 Comments