యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం
నరనరాన దేశభక్తి పొంగులెత్తు శక్తులం
ప్రళయ ఝంఝ మారుతం - హైందవం మహాధ్బుతం
జగతిలో మహోన్నతం - ధర్మజనుల భారతం
అజేయ యోగ శక్తిరా...
అజేయ యోగ శక్తిరా - అభేద్య భరత ధాత్రిరా
శత్రుమూక చుట్టుముట్టె - మట్టుబెట్టు సైనికా !! యుగ యుగాల
గాండివం,సుదర్శనం - భవాని ఖడ్గ ధారులం
ఇనుపకండరాలు,ఉక్కు నరాలున్న యువకులం
స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధలం,యోధులం
స్వర్ణ చరిత పుటలలో - అఖండ కీర్తి ధాములం
జ్ఞాన శీలవంతులై...
జ్ఞాన శీలవంతులై - హనుమ భీమ బంటులై
ధర్మ రక్ష దీక్ష మనది - ఆగకుండ సాగుదాం !! యుగ యుగాల
హిందుసంద్ర హిమనగం - గంగ సింధు సాగరం
ధీర గంభీర జలధి - నిత్య స్పూర్తిదాయకం
గ్రీకు హూణ శక కుషాణు లణచినావు భూసుతా
మొఘలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడా
అడుగడుగున విజయమే...
అడుగడుగున విజయమే - ఆగదీ ప్రభంజనం
దేశధర్మ రక్షణకై - సాగుతోంది జనపదం !! యుగ యుగాల
హిందుసైన్య తాండవం - ప్రళయ కాల గర్జనం
ఫణవ, భేరి, శంఖనాద, తాళ యోగ ఘోషణం
పదం పదం భుజం భుజం - సంచలనం ధరాతలం
త్రివిక్రముల్ త్రిలోకముల్ - నిలిచె హిందువైభవం
మడమ త్రిప్పవద్దురా....
మడమ త్రిప్పవద్దురా - పిడికిలి బిగియించరా
దుశ్శాసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టరా !! యుగ యుగాల
నరనరాన దేశభక్తి పొంగులెత్తు శక్తులం
ప్రళయ ఝంఝ మారుతం - హైందవం మహాధ్బుతం
జగతిలో మహోన్నతం - ధర్మజనుల భారతం
అజేయ యోగ శక్తిరా...
అజేయ యోగ శక్తిరా - అభేద్య భరత ధాత్రిరా
శత్రుమూక చుట్టుముట్టె - మట్టుబెట్టు సైనికా !! యుగ యుగాల
గాండివం,సుదర్శనం - భవాని ఖడ్గ ధారులం
ఇనుపకండరాలు,ఉక్కు నరాలున్న యువకులం
స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధలం,యోధులం
స్వర్ణ చరిత పుటలలో - అఖండ కీర్తి ధాములం
జ్ఞాన శీలవంతులై...
జ్ఞాన శీలవంతులై - హనుమ భీమ బంటులై
ధర్మ రక్ష దీక్ష మనది - ఆగకుండ సాగుదాం !! యుగ యుగాల
హిందుసంద్ర హిమనగం - గంగ సింధు సాగరం
ధీర గంభీర జలధి - నిత్య స్పూర్తిదాయకం
గ్రీకు హూణ శక కుషాణు లణచినావు భూసుతా
మొఘలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడా
అడుగడుగున విజయమే...
అడుగడుగున విజయమే - ఆగదీ ప్రభంజనం
దేశధర్మ రక్షణకై - సాగుతోంది జనపదం !! యుగ యుగాల
హిందుసైన్య తాండవం - ప్రళయ కాల గర్జనం
ఫణవ, భేరి, శంఖనాద, తాళ యోగ ఘోషణం
పదం పదం భుజం భుజం - సంచలనం ధరాతలం
త్రివిక్రముల్ త్రిలోకముల్ - నిలిచె హిందువైభవం
మడమ త్రిప్పవద్దురా....
మడమ త్రిప్పవద్దురా - పిడికిలి బిగియించరా
దుశ్శాసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టరా !! యుగ యుగాల
0 Comments