సాగవోయి సాధక సమర శీల యోదుడ - sagavoyi sadaka samarasheela yoduda

సాగవోయి సాధక - సమర శీల యోదుడ
ఆగని యీ పయనంలో - తుది విజయం మనదిరా || సాగవోయి||

ఒకే జాతి ఒకే నీతి ఒకటే మన సంస్కృతి
ఒకే హిందూ వాహినిగా ప్రవహించేను భారతి
ఈ ఝరిలో విషం కలుపు విద్రోహులు పీచమణచి
అభ్యుదయామృత ఫలాలు అందరికి పంచుటకై || సాగవోయి||

హిందూ సంస్కృతి గంగా ధరలలో జలకాలాడి
తరతరాల వారసత్వ తిలకమ్మును నుదుట దాల్చి
చందమామ సొగసు వంటి స్నేహం హృది విరియాలి
భరతమాత బిడ్డలమని నింగి దాకా చాటాలి || సాగవోయి||

కరం కరం కలిపి కదిలి క్రాంతివ్యూహ మల్లాలి
కణం కణం కలిసి కలిపి గుణం విస్తరించాలి
శరవేగంతో ఉద్యమశక్తి సాగిపోవాలి
అఖండ భారత ధాత్రి పైన ధర్మ ధ్వజం ఎగరాలి || సాగవోయి||

Post a Comment

0 Comments