ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం - ee bhoomi biddalam hinduvulamandaram - rss geeth

ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం
కష్టసుఖముల లోన కలిసి మెలసుంటుంటే
బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారుకలలన్ని పండేనురా ||ఈ భూమి||
ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక
అమ్మ ఒడిలో బిడ్డ లాటాడుకొన్నట్లు
ఒక తీగ పూవులై, ఒక పాట మాటలై
కష్ట సుఖముల లోను కలిసి మెలసుంటుంటే || బ్రతుకు||
శృతిలేని పాటలు మతిలేని మాట లా
ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా
నీటి చుక్కల్లాగ కాటి పూవుల్లాగ
నశియించి పోకుండ నలుగురితో కలిసుంటె || బ్రతుకు||
చూపు కన్నులదంచు, చేత చేతులదంచు,
మింగి మన పొట్టొక్కటే మిడిసి పడుతుందంచు
విడగొడితే బ్రతుకంతా వెతలతో నిండురా
కలబోయ జీవమై కణకణము నిండింతే     ||బ్రతుకు||

Post a Comment

0 Comments