వందనమమ్మా - ఓ అంబ భారతాంబ నీకు వందనమమ్మా - vandanamamma o amba bharataamba - rss geeth

వందనమమ్మా - ఓ అంబ భారతాంబ నీకు వందనమమ్మా || వందనమమ్మా||
ఈ మట్టిలో మా దేహము - పుట్టినదని చెప్పుతారు
ఈ మట్టిలో మా దేహము - గిట్టుననుచు చెప్పినారు
పుట్టి పెరిగి తుట్టతుదకు - గిట్టుదు మీ మట్టిలోన || వందనమమ్మా||
గంగ యమున కృష్ణమ్మా - సింధు తుంగభద్రమ్మా
జీవనదుల నిచ్చినావు - పాడిపంట లొసగినావు
ఈ జగాన సాటి లేని - రత్నగర్భవమ్మ నీవు || వందనమమ్మా||
రామ కృష్ణ భగవానుడు - అరవిందుల కవిచంద్రుల
శూర వీర ధీరులు - సాదు సంతు పుంగవులు
ప్రసాదించి లోకానికి - వెలుగునిచ్చినావు తల్లి || వందనమమ్మా||
కేశవ మాధవులు మమ్ము - భుజముతట్టి లేపినారు
త్యాగధనులు మానధనులు - దారి చూపుచున్నారు
హిందువులకు నీ బిడ్డ - సంఘటనలో చేర్చుతాము
హిమగిరి శిఖరం పైన - నీ పతాక నిలుపుతాము || వందనమమ్మా||

Post a Comment

0 Comments