పాడరా ఎలుగెత్తి భవ్య భారతిగీతి
చాటరా చెయ్యెత్తి జాతివైభవ కీర్తి
చూడరా కనులెత్తి జనని సుందర మూర్తి
ఆడరా శివమెత్తి అరిభయంకర దీప్తి || పాడరా||
బంగారు పండే టి భూమి రా మనది
రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది
ప్రకృతి సౌందర్యం పు ప్రోవు ఈ నేల
నాక లోకం కన్న మిన్న రా చాలా || పాడరా||
కమనీయ కావ్యాలు కవులల్లినారురా
రాలు కరుగగ గాన మాలపించారురా
రాతినే నాతియని భ్రమియింపజేశారు
నీతి పథమున మనుజ జాతి నడిపించారు || పాడరా||
శ్రీ రామచంద్రుడు మా ధర్మ ప్రభువనీ
శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాత యని
ధీరకేశవవాణి దివ్యమంత్రమ్ముగా
మరల హైందవజాతి మహిని వెల్గొందునని || పాడరా||
చాటరా చెయ్యెత్తి జాతివైభవ కీర్తి
చూడరా కనులెత్తి జనని సుందర మూర్తి
ఆడరా శివమెత్తి అరిభయంకర దీప్తి || పాడరా||
బంగారు పండే టి భూమి రా మనది
రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది
ప్రకృతి సౌందర్యం పు ప్రోవు ఈ నేల
నాక లోకం కన్న మిన్న రా చాలా || పాడరా||
కమనీయ కావ్యాలు కవులల్లినారురా
రాలు కరుగగ గాన మాలపించారురా
రాతినే నాతియని భ్రమియింపజేశారు
నీతి పథమున మనుజ జాతి నడిపించారు || పాడరా||
శ్రీ రామచంద్రుడు మా ధర్మ ప్రభువనీ
శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాత యని
ధీరకేశవవాణి దివ్యమంత్రమ్ముగా
మరల హైందవజాతి మహిని వెల్గొందునని || పాడరా||
0 Comments