హైందవోజ్జ్వల శతాబ్దానికి - Haindavojwala satabdaaniki

హైందవోజ్జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానం
ధర్మ రక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయం || హైందవో||
భావదాస్యపు నిశలు తొలిగే స్వాభిమానం ఎదనుపొంగె
మానసమున మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలే
వీర శివ రాణా ప్రతాప్ దీర విక్రమ స్ఫూర్తితో
పరమవైభవ లక్ష్యసాధన యజ్ఞపూర్తికి కదలుదాం || హైందవో|
స్వావలంబన మరువతగదు స్వార్థపరులై మసలరాదు
జనశ్రేయము కడ్డు తగిలెడు నినాదాలు నమ్మతగదు
పరమపావన స్వదేశీ మంత్రమ్ము నిత్యం స్మరణ చేస్తూ
స్వాభిమానం స్వతంత్ర సర్వశ్రేష్ఠ జీవన సాధనముతో || హైందవో ||
విషపు నాగులు కాటువేయగ అదనుకొరకై పొంచి యున్నవి
పంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలచి యున్నవి
తల్లి భారతి ఋణము దీర్చ తరుణ మిదియని మదిని తలచి
రాష్ట్ర సేవా యజ్ఞవేదిని జీవితమ్మును సమీధ చేయగ || హైందవో||

Post a Comment

0 Comments