చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం - cheyi cheyi kalupudaam seva cheya kadaludaam - rss geeth

చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం
ప్రజల కొరకు సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం || చేయి||
అవయవాలు వేరైనా ఆత్మమాత్రమొక్కటే
ప్రాంతం పేరేదైనా ప్రజలంతా ఒక్కటే
భాషలెన్ని పలికినా భావ సంపదొక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన మొక్కటే || చేయి||
కంటి నలుసు కాలిముల్లు కలిగించే బాధలను
గుండె రగుల మెదడు కదులు కరములు తొలగించురా
భరతభూమి నేసీమను బాధలు పెల్లుబికిన
మన కండలు కరిగించి ఇడుములు తొలగించుదాం || చేయి||
జనశక్తి జాతి కొరకు జాగృతి మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలను ఊహనిచట పెంచుదాం
వందేమాతర మంటూ ముందు ముందు కేగుదాం
ఒకరికొకరు తోడు నిలచి ఉన్నతి సాధించుదాం || చేయి||

Post a Comment

0 Comments