భారతాంబిక పునర్వైభవ - bharatambika punarvaibhava - rss geeth

భారతాంబిక పునర్వైభవ ప్రాప్తికొరకే అంకితం
కోట్లకొలదిగ హైందవేయులు సమర్పించే వందనం!
కవుల కలముల జాలువారే కవిత్వామృత ధారలన్నీ
గాయకుల గొంతులను పలికే మధురమౌ నిస్వనములన్నీ
భావుకుల గుండెల్లో ఊరికి పరుగులిడు భావమ్ములన్నీ ||భారతాంబిక||
హలం పట్టి పొలం దున్నే కర్షకుల కరములు సత్తువ
శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరాలు బిగువు
కత్తిపట్టి కదనుత్రిక్కే వీరసైనిక ధీరహృదయం                || భారతాంబిక||
నవత కోరే యువతగుండెల ఉరకలెత్తే నవోత్సాహం
భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరునగవు సిరులు
సకల శాస్త్ర విజ్ఞాన వేత్తల పాండిత్య ప్రకర్ష లన్నీ            || భారతాంబిక||
అన్ని కళలూ అన్ని విద్యలు వృత్తులూ ప్రవృత్తులన్నీ
ప్రాంతభాషా కులమతమ్ముల భేదాలు ఛేదించుకుంటూ
దేశ శ్రేయమే ధ్యేయమై నిజ, దేశ రక్షణ దీక్షగైకొని         || భారతాంబిక||

Post a Comment

0 Comments