జాతీయ భావ పునః నిర్మాణం

అమృతవచనం

పు|| పూ||డా || హెడ్డెవార్ జీ ఇలా అన్నారు :
సాత్విక ప్రవృత్తితో కూడిన రాష్ట్రీయతకు అంటే దైవీ రాష్ట్ర వాదానికి మనం వారసులం, ఈ చరాచర సృష్టి ఆరంభంలోనే, మహానుభావులైన మన పూర్వులు అత్యంత నిర్లిప్త భావంతో యోచించి ఆ నిర్ణయానికి వచ్చారు. ఇదే పరంపరకు సాకారమూర్తులుగా భగవాన్ శ్రీరాముడు, భగవాన్ శ్రీ కృష్ణుడు మున్నగువారు ఇచ్చట అవతరించారు. చంద్రగుప్త మౌర్యుడు రాజ్యాధికారాన్ని సంపాదించిన మరుక్షణం తనకై ఏదీ ఆశించకుండానే సరాసరి అరణ్యానికి పయనమై ఆర్య చాణక్యుడు, విజయనగరసామ్రాజ్య సంస్థాపనాంతరం సన్యాసాశ్రమం స్వీకరించిన మాధవాచార్యులు ఇదే పరంపరకు చెందిన శ్రేష్టపురుషులు మనము ఈ పరంపరకు వారసులమే, కనుకనే ఇట్టి ఈశ్వరీయమైన హిందూ రాష్ట్రీయతను పునఃప్రతిష్ట చేయుటకే మన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తుంది.

Post a Comment

0 Comments