భారతదేశం గురించి

అమృతవచనం

మహాకవి రవీంద్రనాథ్ ఠాకూరు ఇలా అన్నారు :

గతమంతా ఒక దివాలాకోరు కాలఖండమనీ, మనకది ఎలాంటి సంపద నిలవలను దివ్వకపోగా, మన పై అత్యధిక ఋణభారాన్ని మోపిందనీ భావించే తీవ్ర ఆధునికతా వాదులు కొందరున్నారు. మును ముందుకు పరుగెత్తే సైన్యానికి, పోషణ వెనకనుండే లభిస్తుందన్న సత్యాన్ని విశ్వసించరు వారు. భూతకాలం అనే ధాన్యాగారం నుండి, ఆలోచనలనే విత్తనాలను వెతికి, వెలికి తీసినందువల్లే చరిత్రలో కొన్ని గొప్ప పునరుత్థానపు కాల ఖండాలు వెలిశాయని అలాంటి వారికి జ్ఞాపకం చేయవలసి వుంటుంది.

Post a Comment

0 Comments