ఆధ్యాత్మికతకు విపరీతార్ధం

7.ఆధ్యాత్మికతకు విపరీతార్ధం: భారతీయ సంస్కృతి, మతం ఆధ్యాత్మికమైనవి గనుక భౌతిక జీవిత సమస్యలపట్ల అవి అనాసక్తంగా వుంటాయనే తప్పుడు నమ్మకమే ఆర్ధిక సమస్యల పరిష్కారానికి మనం పాశ్చాత్య ప్రపంచంవైపు చూడటానికి ప్రధానకారణం. వాస్తవానికి ధర్మానికి మన నిర్వచనం భౌతికతను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకుంది. అభ్యుదయ, నిశ్రేయస (భౌతిక, పారలౌకిక) మైన రెండురకాల అధివృద్ధిని చేకూర్చేదిగా ధర్మం నిర్వచించబడింది. భౌతికత, ఆధ్యాత్మికత పరస్పర విరుద్ధమైనవి కావు. అన్ని సమస్యలను మనం పరిశీలించే జీవనదృక్కోణం ఆధ్యాత్మికత. విశ్వానికి ఆధ్యాత్మికత ఒక యదార్ధమైన నిర్వచనాన్ని ఇవ్వగలిగినప్పుడు ప్రపంచసమస్యలన్నింటికి అది మనకొక పరిష్కారాన్ని చూపలేక పోవటానికి కారణంలేదు. భారతదేశం పారలౌకిక ప్రపంచం గురించి మాత్రమే ఆలోచించలేదు. భౌతిక సంపద గురించి కూడా ఆలోచించింది. సౌఖ్యం ధర్మంమీద ఆధారపడి వుంటుందని, ధర్మం భౌతిక సంపద మీద ఆధారపడి వుంటుందని చాణక్యుడన్నాడు.

Post a Comment

0 Comments