భగవాధ్వజ సందేశం

69. భగవాధ్వజ సందేశం: భగవాధ్వజం మన సంస్కృతి యొక్క సందేశాన్ని మనకు ఇస్తున్నది. అది మనలో త్యాగభావనను నింపుతుంది. ఈ సందేశాన్ని కొందరు వినలేక పోవటం సంభవమే. ఎందుకంటే సమర్పణభావనతో జ్వలించే హృదయం మాత్రమే ఈ సందేశం యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించగలుగుతుంది. ఈ ధ్వజం మన జాతి యొక్క యావత్ చరిత్రకు సంకేతరూపం. వేద ఋషుల వచనాలను, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు మొదలు తులసీదాసు, నానక్, చైతన్యుడు, రామదాసు వరకు గల మహనీయుల జీవితాలను సజీవంగా మనముందు వుంచుతున్నది. మహా యోధాగ్రేసరుల విజయగాధలు, దేశమంతటా వెలసివున్న దేవాలయాలు, ఈ భూమిని పునీతం చేస్తున్న పవిత్ర నదులు అందులోనే వున్నాయి. తాను స్వయంగా పవిత్రమైనదిగా వుండటం మాత్రమేగాక తనకు అర్పించబడిన ప్రతిదానినీ కూడా పవిత్రం చేసే లక్షణంతో విరాజిల్లే అగ్నికి ప్రతీకం ఈ ధ్వజం. అలాంటి కఠోరమైన పవిత్రతతో కూడిన జీవితాన్ని గడపాలని భగవాధ్వజం మనకు బోధిస్తున్నది.

Post a Comment

0 Comments