67. సంఘటిత సమాజం అమరమైనది: | అందరూ కలసి సంఘటనగా రూపొందటమే ప్రగతికి మార్గం. వేర్వేరుగా అసంఘటిత వ్యక్తులుగా జీవించటం వినాశనానికి మార్గం. కారణమేమంటే వ్యక్తికైతే అంతము ఉంటుంది కాని సంఘటన శాశ్వతం. సంఘటితంగా వున్నంతకాలం మనిషి అమరుడే. వ్యక్తులు చెల్లాచెదరై పోయినప్పుడు వ్యక్తి అంతరించటం తధ్యం. కనుక వ్యక్తులు వ్యక్తిత్వవాదాన్ని విడిచిపెట్టి సంఘటనాశక్తిని పెంపొందించు కోవాలి. మనిషి అమృతత్వం కోసం తపిస్తాడు. ఈ అమృతత్వాన్ని సంఘటన ద్వారానే సాధించవచ్చు. సంఘటిత సమాజ జీవనమే అమృతత్వానికి మార్గం.
0 Comments