సంస్కృతం మన సమాన భూమిక

65. సంస్కృతం మన సమాన భూమిక: సంస్కృతాన్ని మనం వదిలివేస్తే అన్ని ప్రాంతీయ భాషలకు నూతన పరిభాషను సమకూర్చడానికి సమాన ప్రాతిపదికగా వుండే భాష ఏది? వాడుకలో వున్న పదాలు ఇంగ్లీషువి. వీటిని మనం కొనసాగనిస్తే కొత్తపరిభాష తెచ్చి పెట్టే ప్రశ్నేలేదు. పర్షియన్ భాషనుంచి ఉరూను వికసింపజేసినపుడు మొఘలులు చేసినట్లుగా కొన్ని సర్వనామాలను, క్రియాపదాలను మాత్రమే మార్చటమవుతుంది. పర్షియనీకరించిన హిందీవల్ల ప్రయోజనం నెరవేరదు. ఆంగ్లేకరించిన హిందీవల్లనూ, లాభముండదు. సగం చదివిన నగరజనాలు ఆ భాషలో
మాట్లాడవచ్చు నేమోగాని అది అధికార, సాహితీ పనులకు వాడటానికి పనికిరాదు. - సంస్కృత ధాతువులతో కూడిన పదాలు ఈనాడు బహుశా విచిత్రంగాను, కష్టంగాను కనిపించవచ్చు; అయితే కొద్ది రోజుల్లో అవి మనకు మరింత సులభమై మన మనసులోని మాటల సూక్ష్మ భావార్థాలను మరింత సమర్ధంగా వ్యక్తపరచగలవు. సంస్కృతంమీద ఆధారపడిన పరిభాష మనకేగాక మొత్తం ఆగ్నేయాసియాకు ఉపయోగకరంగా వుంటుంది. అంతేగాక ఆధునిక పరిభాషల్లో ఒక్క సంస్కృతం మాత్రమే అంతర్జాతీయ పరిభాషకాగలదు.

Post a Comment

0 Comments