61. క్రమశిక్షణ సమస్య: పార్టీని పరిపూర్ణ ఆరోగ్యస్థితిలో వుంచడానికేగాక సామాన్యంగా ప్రజల ప్రవర్తనపై ప్రభావాన్ని కూడా చూపుతుంది గనుకనే పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యమున్నది. ప్రభుత్వమనేది ప్రాథమికంగా సంరక్షణ, పరిరక్షణలకే సాధనంగా వుంటుందితప్ప వినాశనానికో, మార్పుకోకాడు, ప్రజానీకంలో చట్టంపట్ల గౌరవాన్ని పెంపొందిచాలంటే చట్టానికి పరిరక్షకులుగా వుండనాకాంక్షించే పార్టీలు స్వయంగా ఈ దిశలో ఆదర్శంగా నిలవాలి. స్వయంపాలనా చైతన్యమూ, అందుకు సామర్థ్యమూ - ఇవే ప్రజాస్వామ్యానికి సారభూతాలు. పార్టీలు తమనుతాము పాలించుకోలేనప్పుడు సమాజంలో స్వయంసాలనా కాంక్షను సృష్టించడానికి ఎలా ఆశించగలవు? వ్యక్తి స్వేచ్ఛకు హామీయిచ్చి పరిరక్షించడం సమాజానికి అత్యవసరమే అయినా వ్యక్తి ఇష్టపూర్వంగా సమాజ అభీష్టానికి తలవొగ్గటం అభిలషణీయం, ఈరకమైన విధేయత (submission) ఎక్కువగావున్నకొద్దీ రాజ్యం యొక్క బలప్రయోగ అధికారం తక్కువగా వుంటుంది. ఏ రాజ్య చట్టంవల్లనోగాక పార్టీయూనిట్లు స్వచ్ఛందంగా ఆమోదించిన నిర్ణయాలచేత వ్యవహారాలు నియంత్రించబడే పార్టీలో వ్యక్తి స్వేచ్ఛను, సామాజిక బాధ్యతను ఎంత చక్కగా సంతులనం చేయవచ్చునో స్వయంగా ఆదర్శాన్ని నెలకొల్పటానికి వీలుంటుంది. కనుక పార్టీలు మా సభ్యులకోసం ఒక ప్రవర్తనా నియమావళిని నిర్దేశించి దాని కచ్చితంగా అనుసరించవలసిన అవసరముంది.
0 Comments