ధర్మరాజ్యం

6. ధర్మరాజ్యం : మన దేశంలో ధర్మంతో అనుబంధంలేని ఏ సున్నిత మనో భావం (సెంటిమెంటు) గురించిగానీ మనం ఆలోచించలేము. కనుక మన రాజ్యం ధర్మాన్ని విడనాడజాలదని మనం భావిస్తాం. లౌకిక రాజ్యం (సెక్యులర్ స్టేట్) అంటే మన అభిప్రాయంలో ధర్మరహిత రాజ్యమని అర్థంకాదు. ఈ దేశంలో మతమంటే ఒక సిద్ధాంతం (tenet). దీనిని నమ్మేవారిని జైన, శైవ, క్రైస్తవ వంటి సంప్రదాయాలుగా వ్యవహరిస్తాం. సహజంగానే రాజ్యం ఈ సంప్రదాయాల్లో వేటికీ చెందదు. అది అందరినీ సమానదృష్టితో చూడాల్సిందే. కనుక రాజ్యం సంప్రదాయానికి అతీతమైనదని మనం చెప్పవచ్చు. అది ఆదర్శవంతమైనదే అవుతుంది. అయితే అలాంటి రాజ్యం ఏదేని ఒక సంప్రదాయం పట్ల పక్షపాత బుద్ధితోనో లేక మరో సంప్రదాయంపట్ల వ్యతిరేకతతోనో వుండకుండానే ఐహిక, ఆముష్మిక పురోగతిని సాధించే సాధనోపాయలను ప్రోత్సహిస్తూ తద్వారా ధర్మరాజ్యంగా వ్యవహరింపబడవచ్చు.

Post a Comment

0 Comments