ప్రజాస్వామ్యం, రాజకీయపార్టీలు

55. ప్రజాస్వామ్యం, రాజకీయపార్టీలు: స్వరాజ్య నిర్వచనంలో మూడు ప్రధాన విషయాలున్నాయి. మొదటగా ప్రభుత్వమనేది జాతిలో భాగంగా వుండేవారి చేతుల్లో వుండాలి. రెండో ప్రత్యేకాంశం ఏమంటే ప్రభుత్వం జాతి ప్రయోజనం కోసమే నిర్వహించబడాలి - దీని అర్ధం దాని విధానాలు జాతి ప్రయోజనం దిశగానే నిర్దేశించబడినవై వుండాలి. మూడోవిషయం జాతి శ్రేయస్సు సాధించడానికై అలాంటి ప్రభుత్వం తనదైన శక్తి కలిగివుండాలి. మరోవిధంగా చెప్పాలంటే స్వావలంబన లేకుండా స్వరాజ్యం గురించి ఆలోచించడమే తప్పు. ప్రభుత్వం జాతీయుల చేతుల్లోనే వున్నప్పటికీ ఆ ప్రభుత్వం మరేదైనా దేశపు వత్తిడికి లొంగటమో, దానిని అనుసరించేదిగా తయారవటమో జరిగితే స్వరాజ్యానికి అర్ధంలేకుండా పోతుంది. రాజ్యానికి దేశరక్షణ విషయంలో స్వావలంబన, విధానాల విషయంలో స్వేచ్ఛ, ఆర్థిక ప్రణాళిక రూపొందించే విషయంలో స్వయంపూర్ణత లేకుంటే దానిని జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసేలా వత్తిడి చేయబడవచ్చు. అలాంటి పరతంత్ర రాజ్యం వినాశనానికి దారితీస్తుంది.

Post a Comment

0 Comments