ప్రజాస్వామ్యం, సోషలిజం

54. ప్రజాస్వామ్యం, సోషలిజం: పండిట్ నెహ్రూగారి రోజుల్లో భారత్ కూడా ప్రజాస్వామిక సోషలిజం నినాదాన్ని ఎత్తుకుంది. ఈ రోజున మనం ప్రయత్నిస్తూ వచ్చిన ప్రజాస్వామ్యం, సోషలిజం మౌలికంగా పాశ్చాత్య పునాదిమీద నిలిచిన వీ, ఆకారణంగా అపరిపూర్ణమైనవీ అయినందుననే ఇందులో మనం సఫలత పొందలేకపోయాం. ఈ రెండు ఆలోచనలు జీవితంయొక్క విభిన్న అంశాలను, వాటికి సంబంధించిన సత్యాలను వ్యక్తపరుస్తాయి. వీటి సమన్వయం సాధ్యమే - అయితే మన దృక్కోణం సమన్వయకారిగా వున్నప్పుడే అది సాధ్యపడుతుంది. పాశ్చాత్యులు అభివృద్ధిపరచిన ప్రజాస్వామిక వ్యవస్థలూ సంప్రదాయాల్లోగాని, లేక మార్క్ ప్రతిపాదించి లెనిన్, స్టాలిన్ ప్రభృతులు ఆచరణలో పెట్టిన రెడీమేడ్ సోషలిజపు మూసల్లోకిగాని మన మొత్తం జీవితాన్ని చొప్పించటం సమంజసం కాదు. ఈ దేశపు జీవనం ఈరెండు భావనలకంటే ఉన్నతమైనది. పాశ్చాత్య రాజకీయాలను భారత్ పై బలాత్కారంగా మోపడానికి బదులు మనదైన రాజకీయ * తత్వశాస్త్రాన్ని మనం పెంపొందించుకోవలసివుంది. ఈపని చేసేటపుడు పాశ్చాత్య దేశాలలోని ఆలోచన నుంచి మనం ప్రయోజనం పొందవచ్చును. కాని దానికి పూర్తిగా దాసోహమనటంగాని, దానినే శాశ్వత సత్యంగా పరిగణించటం గాని మనం చేయరాదు.

Post a Comment

0 Comments