అధికార కేంద్రీకరణ

53 అధికార కేంద్రీకరణ: ఒకే వ్యక్తిలో లేక సంస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అధికారాలు కేంద్రీకృతం కావటం ప్రజాస్వామ్య పథంలో ఒక అవరోధం. సాధారణంగా ఒకానొక రంగంలో అధికారం ఒకవ్యక్తిలో కేంద్రీకృతమైనపుడు ఆవ్యక్తి ఇతరరంగాల్లో కూడా అధికారాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన చేతుల్లోనే కేంద్రీకరించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కమ్యూనిస్టు, బిలాఫత్ నియంతృత్వ ప్రభుత్వాలు ఇలాగే నెలకొల్పబడ్డాయి. మానవ జీవితం ఏకాత్మకము, దాని విభిన్నక్షేత్రాలు పరస్పరపూరకాలు అయినప్పటికీ ఈ విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహించే యూనిట్లు వేటికవి విడిగానే వుండాలి. మామూలుగా చెప్పాలంటే పరిపాలనా క్షేత్రానికి సంబంధించిన వివిధ యూనిట్లు పరిపాలనా వ్యవహారాలే చూడాలి తప్ప ఆర్ధిక రంగంలోకి ప్రవేశింకూడదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ తొలుత ఆర్థికరంగంలో అధికారం సంపాదించి ఆ పైన రాజకీయరంగంలోకి అడుగుపెడుతుంది. కాగా సోషలిజమేమో ఉత్పాదన సాధనాలన్నింటి మీద అధికారాన్ని రాజ్యం (ప్రభుత్వం) చేతుల్లో కేంద్రీకరిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు వ్యక్తి యొక్క ప్రజాస్వామిక హక్కులకు, వాటి సముచిత వికాసానికి వ్యతిరేకమైనవి. కనుక కేంద్రీకరణతోబాటు అధికారాల విభజన గురించి కూడా మనం ఆలోచించవలసివుంది.

Post a Comment

0 Comments