చర్చద్వారా ప్రభుత్వం

7. ప్రజాస్వామ్యపు మూలసూత్రాలు 51. చర్చద్వారా ప్రభుత్వం: ప్రజాస్వామ్యం అంటే చర్చద్వారా ప్రభుత్వం అని నిర్వచించబడింది. ఈ చర్చా సంప్రదాయం మనదేశంలో ఎప్పటినుంచో వుంది. అయితే ప్రతిపార్టీ ఇతర పార్టీ చెప్పేదానిని జాగ్రత్తగా ఆలకించి అందులోని సత్యాన్ని ఆమోదించే కోరిక కలిగి వుంటేనే అలాంటి చర్చ ఫలప్రదం కాగలదు. వేరేవ్యక్తి యొక్క దృక్పథాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించడానికి బదులు మన అభిప్రాయమే ఒప్పుకోవాలని మనం పట్టుబడితే అలాంటి చర్చ నిష్ఫలంగానే మిగిలిపోతుంది. “నీవు చెప్పేదానితో నేను ఏకీభవించను, కాని అది చెప్పేందుకు నీకు గల హక్కుకోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టి అయినాసరే సమర్ధిస్తాను” అని వోల్టేర్ అన్నాడంటే చర్చలోని నిష్పలమైన భాగాన్ని ఆయన ఆమోదిస్తున్నాడని మాత్రమే భావించాలి. భారతీయ సంస్కృతి ఇంతకంటే ముందుకుపోయి చర్చను. సత్య సాక్షాత్కారానికోక సాధనంగా పరిగణిస్తుంది. సత్యమనేది ఏకపక్షంగా వుండదని, దానియొక్క వివిథ రూపాలను వివిధ కోణాల నుంచి చూచి, పరీక్షించి, అనుభూతి చెందవచ్చునని మనం విశ్వసిస్తాం. కనుక అలాంటి వైవిధ్యతలలో అంతర్నిహితంగా వుండే ఏకత్వాన్ని సమగ్ర దర్శనం చేసే సమర్ధత గలవాడు ఒక ద్రష్ట (ఋషి) అవుతాడు.

Post a Comment

0 Comments