వ్యక్తినీ, సమాజాన్నీ విడదీయలేం

50. వ్యక్తినీ, సమాజాన్నీ విడదీయలేం: వ్యక్తికీ సమాజానికీ మధ్య పరస్పరం వైరుధ్యమున్నదని భావించటం పొరబాటు అనే నిర్ధారణకు భారత్ వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా వికృతి, లేదా అవ్యవస్థ ఏర్పడితే మాత్రం దానిని తొలగించడానికి చర్యలు తీసుకోవటం అవసరమే. కాని మౌలిక సత్యమేమంటే వ్యక్తి, సమాజం ఒకటే; అవిభాజ్యం. సంస్కారవంతమైన వ్యవహారంలో వ్యక్తి తన గురించి ఆలోచిస్తూనే సమాజం గురించి ఆలోచిస్తాడు. సమాజానికి హానిచేయడం ద్వారా తన స్వంతమేలు సాధించాలని ఎవరైనా ఆలోచిస్తే అతని ఆలోచన పెడత్రోవ పట్టిందన్నమాట. ఇది వికృతి చెందిన పరిస్థితి. దీనివల్ల వ్యక్తికి మేలు జరగదు. ఎందుకంటే సమాజం ఏ పరిస్థితికి గురియవుతుందో వ్యక్తి కూడా అదే పరిస్థితి అనుభవించవలసి వస్తుంది.

Post a Comment

0 Comments