సోషలిజం ఘర్షణను అంగీకరిస్తుంది

49. సోషలిజం ఘర్షణను అంగీకరిస్తుంది: ఇవాళ ఎక్కడ చూసినా సోషలిజం గురించి చర్చ జరుగుతున్నది. ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైన వ్యవస్థగా నిగురించి భావిస్తున్నారు. సోషలిజమంటే అన్ని ఉత్పాదక, పంపిణి సాధనాలమీద ప్రభుత్వ (state) నియంత్రణ State) నియంత్రణ అని అర్ధం. అలాంటి పరిస్థితిలో ప్రజలు కూలీల స్థాయికి దిగజారుతారు. స్వతంత్ర యాజమాన్యం వుండదు. అలాంటి సోషలిజాన్ని నెలకొల్పడానికై వర్గసంఘర్షణ, రక్తపాతంతో కూడిన విప్లవం రావాలంటారు. ఈ సోషలిజాన్ని శాంతి యుతంగా తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవస్థ వ్యక్తికి, సమాజానికి మధ్య ఒక ఘర్షణను ఆమోదించి వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేస్తుంది గనుక అందులో మనిషి యంత్రంలోని ఒక భాగంగా మాత్రమే తయారవుతాడు. అలాంటి సోషలిజంలో వ్యక్తికీ, సమాజానికీ మధ్య వుండే సంబంధం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో పొసగనిది. మనం ఈ రకమైన సోషలిస్టులం కాదు; | పాశ్చాత్యుల తరహా వ్యక్తివాదులమూకాదు. వ్యష్టిమీదనే ప్రధానంగా దృష్టి పెట్టేవాడు అంధకారంలోకి పోతాడని, సమష్టిని మాత్రమే ఆరాధించే వాడికి కూడా అదేగతి పడుతుందని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. భారతీయ వ్యవస్థ ఈ రెండింటి మేళనానికి పిలుపునిస్తున్నది. వ్యక్తి , మరణించవచ్చు కాని సమాజం ఎన్నటికీ మరణించదు గనుక సమాజంలో వ్యక్తిని విలీనం చేయడానికే మనం కృషిచేస్తున్నాం.

Post a Comment

0 Comments