యంత్ర ప్రయోజనం

46. యంత్ర ప్రయోజనం: మనిషి యొక్క ఉత్పాదకతను పెంచి అతని శ్రమను, తగ్గించటానికి యంత్రం రూపొందించబడింది. యంత్రం మనిషికి సహాయపడేదేతప్ప, పోటీదారుకాదు. కాని ఎప్పుడైతే మానవుడి శ్రమ ఒక వస్తువైపోయి.
దానికొక ధర ఏర్పడిందో అప్పుడు యంత్రం మనిషిని పోటీదారు అయింది. పెట్టుబడిదారుడి దృక్పథంలోని లోపం ఇదే. మనిషి స్థానంలోకి యంత్రం వచ్చేసి మనిషి తిండిలేక మరణిస్తే యంత్రం రూపొందించబడిన ఉద్దేశం నెరవేరదు. అయితే ఇందుకు జీవంలేని యంత్రం బాధ్యురాలుకాదు. ఈ దోషం అనాలోచిత ఆర్థికవ్యవస్థదే అవుతుంది. యంత్రం ఉపయోగం గురించి మనం నిర్ణయం తీసుకొనేటపుడు దాని పరిమితిని దృష్టిలో పెట్టుకొని తీరాలి.

Post a Comment

0 Comments