పారిశ్రామిక కార్పొరేషన్లు

43. పారిశ్రామిక కార్పొరేషన్లు: మన పరిశ్రమలను విజయవంతంగా నిర్వహించాలంటే వాటిని సమాజ ప్రయోజనాల పరిమితిలో పూర్తిగా వాణిజ్య ప్రాతిపదికన నిర్వహించాలి. కనుక వాటిని రోజుకోరకంగా మార్పుచెందే పార్టీ రాజకీయాలకు దూరంగా వుంచవలసి వుంటుంది. ఈ దృష్ట్యా అవి స్వతంత్ర ప్రతిపత్తిగల కార్పొరేషన్ల నిర్వహణలో వుండాలి. వాటికి దైనందిన వ్యవహారాలలో స్వేచ్ఛవుండాలి; అయితే పార్లమెంటరీ నియంత్రణలో వుండాలి. యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం అంశానికి సంబంధించి ప్రభుత్వరంగ పరిశ్రమలు ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా ముందుండాలి.

Post a Comment

0 Comments