ధర్మమే దేవుడికి మార్గదర్శనం చేస్తుంది

4.ధర్మమే దేవుడికి మార్గదర్శనం చేస్తుంది: దేవుడు ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించజాలడు. అలా చేస్తే ఆయన సర్వశక్తిమంతుడుకాడు. అధర్మం బలహీనతయొక్క లక్షణమే తప్ప బలానికి లక్షణంకాదు. అగ్ని వేడిని ప్రసరింప జేయటానికి బదులు చల్లారిపోతే అది ఇంకెంతమాత్రం శక్తివంతమైనదికాదు. బలమనేది విశృంఖల ప్రవర్తనలో వుండదు; చక్కని . నియమబద్దమైన కార్యాచరణలోనే వుంటుంది. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు స్వయం నియంత్రణకలవాడు కూడాను. ఫలితంగా ధర్మంతో పూర్తిగా అనుగుణంగా వుంటాడు. అధర్మాన్ని నాశనం చేసి, ధర్మాన్ని పున: ప్రతిష్టించడానికే దేవుడు మానవశరీరంతో అవతరిస్తాడుతప్ప . విచక్షణారహితంగా తోచినట్లల్లా చేయడానికి కాదు. కనుక
దేవుడైనా సరే ధర్మానికి విరుద్ధంగా పోకుండానే ఏదైనా చేస్తాడు. అపార్ధం చేసుకోకపోతే దేవుడికన్నా ధర్మమే గొప్పదనవచ్చు. ఆయన ధర్మానుసారం వ్యవహరిస్తాడు కనుకనే విశ్వం నిలిచి వుంటున్నది.

Post a Comment

0 Comments